Asianet News TeluguAsianet News Telugu

పల్నాడులో విషాదం... నీటికాలువలో దూకి చెల్లి, కాపాడబోయి అన్న మృతి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకురపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

First Published Sep 12, 2022, 4:41 PM IST | Last Updated Sep 12, 2022, 4:41 PM IST

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకురపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చెల్లిని కాపాడబోయి అన్న కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇలా అన్నాచెల్లెళ్ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. లంకెలకురపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి, కృష్ణవేణి అన్నాచెల్లెలు. అయితే కుటుంబ కలహాల కారణంగా కృష్ణవేణి(22) ఇంట్లోంచి బయటకు వచ్చి గుంటూరు బ్రాంచ్ కెనాల్ లో దూకింది. ఆమె వెంట వచ్చిన సోదరుడు వేణుగోపాల్ చెల్లిని కాపాడేందుకు కెనాల్ లో దూకాడు. భారీ వర్షాల కారణంగా కెనాల్ లో నీటి ఉదృతి అధికంగా వుండటంతో అన్నాచెల్లెలు ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వేణుగోపాల్ ను ఒడ్డుకు చేర్చినా అప్పటికే అతడు మృతిచెందాడు. అతడి సోదరి కృష్ఱ వేణి మృతదేహం గల్లంతయ్యింది.