కన్నీరు పెట్టిస్తున్న వంకాయ.. పంట అమ్ముకోవడానికి అప్పులు చేస్తున్న రైతులు..

కర్నూలు జిల్లాలో వంకాయ పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది.

First Published Jul 1, 2020, 12:54 PM IST | Last Updated Jul 1, 2020, 12:54 PM IST

కర్నూలు జిల్లాలో వంకాయ పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండినా గిట్టుబాటు ధర లేకపోవడంతో వంకాయ రైతులు పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. చెట్టు కోసేసి నిరసన తెలుపుతున్నారు. సీజన్ మొదట్లో కాస్త ధర పలికినా ఇప్పుడు దళారులు రూపాయికి కిలో చొప్పున కొంటున్నారని వాపోతున్నారు. వంకాయలు తెంపడానికే రోజు కూలి 200 ఇస్తున్నామని, పండించిన పంటను అమ్ముకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలనివేడుకుంటున్నారు.