గూడు లేక అంగన్వాడీలో నివాసం... చివరిరోజుల్లో అంబేద్కర్ భార్య అవస్థలివీ..: మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
విశాఖపట్నం: రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తిత్వం గురించి మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్ ఏ సాయం చేసిన తిరిగి ఏదీ ఆశించేవాడు కాదని...
విశాఖపట్నం: రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తిత్వం గురించి మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్ ఏ సాయం చేసిన తిరిగి ఏదీ ఆశించేవాడు కాదని... ఒకవేళ ఆయన భార్య ఏదయినా స్వీకరించినా కోపగించుకునేవాడని తెలిపారు. ఇలా ఓసారి మిఠాయి పొట్లం స్వీకరించినందుకు మూడురోజులు అన్నం ముట్టుకోకుండా భార్యతో మాట్లాడలేదని చింతా మోహన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఇక అంబేద్కర్ మృతితర్వాత ఆయన భార్యను పట్టించుకునేవారు లేక తీవ్ర అవస్థలు పడిందన్నారు. ఆమె పరిస్థితి తెలిసి తాను మంత్రిపదవి చేపట్టిన తర్వాత మొట్టమొదట ప్రధాని పివి నరసింహారావుకు లేఖ రాసానని చింతా మోహన్ తెలిపారు. అంబేద్కర్ భార్య ఆర్థిక ఇబ్బందుల్లో వుందని... ఆమెకు ఇళ్లు లేదు, కారు కూడా లేక అవస్థలు పడుతోందని ప్రధానికి తెలిపానన్నారు. ముంబైలోని ఓ అంగన్వాడి కేంద్రంలో ఆమె నివాసం వుంటోదని తెలిపానని అన్నారు. అంబేద్కర్ పై గౌరవంతో ఆయన భార్యకు ఇళ్లు, ఓ కారుతో పాటు నెలకు రూ.25వేల ఆర్థిక సాయం చేయాలని ప్రధానికి కోరినట్లు చింతా మోహన్ వెల్లడించారు.