కార్తీక పౌర్ణమికి ముందురోజే అపశృతి ... సముద్ర స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు
మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్రస్నానానికి వెళ్లిన బాలుడు అలల తాకిడికి గల్లంతయిన దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్రస్నానానికి వెళ్లిన బాలుడు అలల తాకిడికి గల్లంతయిన దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన బాలుడు గోళ్ల నవీన్ కుమార్ (14) గూడూరు జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న ఆదివారం సెలవరోజు కావడంతో స్నేహితలతో కలిసి సముద్ర స్నానానికి మంగినపూడి బీచ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులంతా సరదాగా నీటిలోకి దిగగా అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరి అయిన నవీన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. బాలుడి కోసం మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపుచర్యలు చేపట్టగా ఇప్పటివరకూ ఆఛూకీ లభించలేదు. బాలుడి గల్లంతు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షించారు.