Andhra News:విజయవాడలో గ్యాంగ్ రేప్... బాధిత యువతి కుటుంబానికి అండగా బోండా ఉమ
విజయవాడ: అభం శుభం తెలియని ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం విజయవాడలో వెలుగుచూసింది.
విజయవాడ: అభం శుభం తెలియని ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం విజయవాడలో వెలుగుచూసింది. ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోనే ఈ అమానుష ఘటన జరిగింది. పాయకపురం వాంబే కాలనీలో నివాసముండే యువతికి మతిస్థిమితం సరిగ్గా లేకపోయినప్పటికి తల్లిదండ్రులు చదవిస్తున్నారు. అయితే ఈ యువతిపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడి కన్ను పడింది. దీంతో ఈ నెల 19వ తేదీన యువతి బలవంతంగా తనవెంట తీసుకెళ్ళి హాస్పిటల్ ప్రాంగణంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తమ కూతురు మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు స్పందించివుంటే ఇంతటి అఘాయిత్యం జరిగేది కాదని అంటున్నారు. ఈ ఘటనాస్థలికి చేరుకున్న టిడిపి నేత బోండా ఉమ తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత యువతి కుటుంబసభ్యులతో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.