సోనూసూద్ సాయం.. చిత్తూరు రైతు ఇంటికి చేరిన ట్రాక్టర్ (వీడియో)

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది. 

First Published Jul 26, 2020, 10:08 PM IST | Last Updated Jul 26, 2020, 10:11 PM IST

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం బాలీవుడ్ నటుడు సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు. దీంతో సోనూసూద్ వెంటనే స్పందించి.. వారికి ముందుగా రెండు  ఎద్దులు అందిస్తున్నట్లుగా ప్రకటించాడు.

తర్వాత కొద్దిసేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోవటంతో ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. 24 గంటలు గడవకముందే ట్రాక్టర్‌ను రైతు ఇంటికి పంపి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సోనూసూద్ .