సీలేరు నదిలో పడవలు బోల్తా: ఎనిమిది మంది గల్లంతు

విశాఖ జిల్లా సీలేరు న‌దిలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రెండు నాటు ప‌డ‌వ‌లు ప్ర‌మాదానికి గుర‌య్యాయి. 

First Published May 25, 2021, 9:32 AM IST | Last Updated May 25, 2021, 9:32 AM IST

విశాఖ జిల్లా సీలేరు న‌దిలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రెండు నాటు ప‌డ‌వ‌లు ప్ర‌మాదానికి గుర‌య్యాయి. ప‌డ‌వ‌లు నీట మున‌గ‌డంతో 8 మంది గ‌ల్లంతు కాగా, వారిలో చిన్నారి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి ముగ్గురు సుర‌క్షితంగా ఒడ్డుకు చేర‌కున్నారు. గిరిజ‌నులు ఒడిశా వెళ్లేందుకు నాటు ప‌డ‌వ‌లో వెళుతుండ‌గా ఘ‌ట‌న చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వ‌ల‌స కూలీలు 11 మంది ఒడిశా వెళ్లేందుకు అర్ధ‌రాత్రి సీలేరు చేరుకున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో నాటు ప‌డ‌వ‌ల్లో వెళుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. గ‌ల్లంత్తైన ఏడుగురి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.