Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ పర్యటనలో నల్ల బెలూన్లు... వారి ఉద్దేశ్యమిదే...: కాంగ్రెస్ నేత రాజీవ్ రతన్

అమరావతి : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

First Published Jul 8, 2022, 10:47 AM IST | Last Updated Jul 8, 2022, 10:47 AM IST

అమరావతి : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇలా కాంగ్రెస్ నాయకుల నిరసనల్లో భాగంగా నల్లబెలూన్లు గాల్లోకి ఎగరేయగా అవికాస్తా ప్రధాని వెళుతున్న హెలికాప్టర్ కు అతి సమీపంలోకి వెళ్ళాయి. దీంతో ప్రధాని భద్రతకు విఘాతం కలిగించారంటూ కాంగ్రెస్ నాయకులు  రాజీవ్ రతన్, రవి లను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరికి స్టేషన్ బెయిల్ లభించడంతో గురువారం రాత్రి గన్నవరం పోలీస్ స్టేషన్ నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ రతన్ మాట్లాడుతూ... నల్ల బెలూన్లు ఎగరవేయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సమయంలో తాను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వున్నానని అన్నారు. కానీ కొన్ని మీడియా సంస్థల్లో నల్ల బెలూన్ల ఎగరేసింది తామేనని ప్రచానం జరిగిందని... పోలీసులు కూడా అలాగే భావించి అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సబంధం లేదని... అందుకు ఆధారాలు కూడా వున్నాయని రాజీవ్ రతన్ తెలిపారు