Asianet News TeluguAsianet News Telugu

తెనాలిలో అర్ధరాత్రి అలజడి... బిజెపి ప్రజాపోరు వాహనానికి నిప్పంటించిన దుండుగులు

గుంటూరు : బిజెపి ప్రచార వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

 

First Published Sep 30, 2022, 12:13 PM IST | Last Updated Sep 30, 2022, 12:14 PM IST

గుంటూరు : బిజెపి ప్రచార వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెనాలి పట్టణంలో గత పదిరోజులుగా వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ప్రజా పోరు యాత్ర పేరిట ప్రచార వాహనం తిరుగుతోంది. అయితే రోజూ మాదిరిగా నిన్న(గురువారం) కూడా ఈ వాహనంతో తెనాలిలో ప్రచారం నిర్వహించిన డ్రైవర్ రాత్రి సుల్తానాబాద్ లోని తన ఇంటి వద్ద నిలిపాడు. తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు దుండగులు పెట్రోల్ బాటిల్ తో బిజెపి ప్రచార వాహనం వద్దకు చేరుకుని నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు గమనించడం చూసి దుండగులు అక్కడినుండి పరారయ్యారు. స్థానికులు చెలరేగుతున్న మంటలను ఆర్పడంతో కేవలం ఆటో మందుబాగం మాత్రమే దగ్దమయ్యింది. 

ప్రజా పోరు యాత్ర వాహనం దగ్దం విషయం తెలిసి స్థానిక బిజెపి నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు దగ్దమైన వాహనాన్ని పరిశీలించారు. వాహనానికి నిప్పంటించిన దుండగులను గుర్తించేందుకు స్థానికంగా వున్న సిసి కెమెరాలకు పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇది ప్రత్యర్థి పార్టీల పనేనని తెనాలి బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.