అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ రాజకీయమే... బిజెపి ఎంపి జివిఎల్ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి బలోపేతమవుతోందని...

First Published Aug 24, 2022, 3:33 PM IST | Last Updated Aug 24, 2022, 3:33 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి బలోపేతమవుతోందని... ఇందుకు ప్రభుత్వం చేపట్టిన ఓట్ల తొలగింపే నిదర్శనమని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో భారీగా ఒట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని... మరీ ముఖ్యంగా ఆంధ్రేతరుల ఓట్లను గుర్తించి మరీ తొలగిస్తున్నారని అన్నారు. ఇలా ఇప్పటివరకు 50వేలకు తక్కువ కాకుండా ఓట్లను గల్లంతు చేసారని... దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాసినట్లు జివిఎల్ తెలిపారు. ఇక బిజెపికి అనుకూలంగా వుండేవారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం, రేషన్, ఫెన్షన్ తొలగిస్తున్నారని ఆరోపించారు. 

ఇక అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపైనా జివిఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేవలం సినిమాల గురించే వీరిద్దరు మాట్లాడుకున్నారని భావించడం లేదని... రాజకీయ ప్రస్తావన లేకుండా వుండదన్నారు.   అయితే ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలన్నారు. అయితే వారిమధ్య రాజకీయ చర్యలే జరిగివుంటాయని జివిఎల్ పేర్కొన్నారు. ఇక డిల్లీ లిక్కర్ స్కాం పైనా జివిఎల్ స్పందిస్తూ ఏపీ, తెలంగాణలో ఈ కుంబకోణం మూలాలు బయటపడుతున్నాయని అన్నారు.