అధికారంలో వుండి ఆత్మాభినమంటూ ఉద్యమాలా...! సిగ్గుచేటు సీఎం గారు : బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి
అనంతపురం : రాయలసీమలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ హంద్రీనివాను వైసిపి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం : రాయలసీమలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ హంద్రీనివాను వైసిపి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల ఇప్పటివరకు హంద్రినివా ప్రాజెక్ట్ విద్యుత్ బిల్లులు రూ.2,343 కోట్లు పెండింగ్ లో వున్నాయని... దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడ్డ లక్షా పదివేల ఎకరాల ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యంగా కర్నూల్, అనంతపురం జిల్లాల రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రజల ఆత్మాభిమానం కోసం ఉద్యమిస్తామంటూ అధికారంలో వున్న మీరే అనడం సిగ్గుచేటని విష్ణువర్ధన్ అన్నారు. నిజంగానే మీకు రాయలసీమ మీద అంత ప్రేముంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి నష్టపోయిన రైతులకు ఈరోజుకీ ఎందుకు న్యాయం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు హంద్రినివా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఒకవైపు నీళ్లన్నీ సముద్రంపాలవుతున్నా పంటలకు నీరు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. రైతుకుల న్యాయం జరగకుంటే బిజెపి రాయలసీమ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడుతుందని వైసిపి ప్రభుత్వానికి, సీఎం జగన్ కు విస్ణువర్ధన్ హెచ్చరించారు.