కొడాలి నాని కేవలం గుడివాడకే మంత్రా..?: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్

అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కేవలం గుడివాడకు మాత్రమే మంత్రా...? లేక రాష్ట్రం మొత్తానికి మంత్రో తెలియడం లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

First Published Jun 11, 2021, 12:25 PM IST | Last Updated Jun 11, 2021, 12:25 PM IST

అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కేవలం గుడివాడకు మాత్రమే మంత్రా...? లేక రాష్ట్రం మొత్తానికి మంత్రో తెలియడం లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపి ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. పౌరసరఫరాల శాఖ రబీ పంటకు సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నామని అన్నారని... కానీ నేటికి కేవలం 25,25,972 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసిందని తెలిపారు. 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం గంట గంటకు చెప్పే ప్రభుత్వం రైతులు ధాన్యం కొనుగోలు సమాచారం ఎందుకు ప్రతి రోజు చెప్పడంలేదు? అని నిలదీశారు. రాజకీయ ముసుగులో ఉన్న మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారి రైతులకు అన్యాయం చేస్తోందని విష్ణువర్దన్ ఆరోపించారు.