చర్చిల నిర్మాణానికి జగన్ సర్కార్ నిధులు... బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన

అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రలో కొత్త చర్చీల నిర్మాణం, పాత చర్చిల మరమ్మతుల కోసం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించడం దారుణమని బిజెపి ప్రధాన కార్యదర్శి  ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 

First Published Nov 18, 2022, 3:30 PM IST | Last Updated Nov 18, 2022, 3:30 PM IST

అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రలో కొత్త చర్చీల నిర్మాణం, పాత చర్చిల మరమ్మతుల కోసం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించడం దారుణమని బిజెపి ప్రధాన కార్యదర్శి  ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నిధుల కేటాయింపుకు సంబంధించి మైనారిటీ సంక్షేమ శాఖ, క్రైస్తవ ఆర్థిక కార్పోరేషన్ ద్వారా ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని... లేదంటే ప్రజలతో కలిసి బిజెపి ఉద్యమాన్ని ఉదృతం చెస్తుందని హెచ్చరించారు. పరిపాలనను గాలికొదిలేసి ప్రజల డబ్బులతో ఓటు బ్యాంకు, మత రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విష్ణువర్ధన్ మండిపడ్డారు. 

దేశంలో బలవంతంగా జరుగుతున్న మత మార్పిడులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేయడాన్ని విష్ణువర్ధన్ గుర్తుచేసారు. అయినా జగన్ సర్కార్ మతమార్పిడులను  ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవడం భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని అన్నారు. ఏపీలో ఓటుబ్యాంకు రాజకీయాలను పతాకస్థాయికి తీసుకెళ్లిన సీఎం జగన్ చర్యలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.