Asianet News TeluguAsianet News Telugu

రామతీర్ధంలో ఉద్రిక్తత... విశాఖ కేజీహెచ్ లో విష్ణువర్ధన్ రెడ్డికి చికిత్స

విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

First Published Jan 8, 2021, 12:20 PM IST | Last Updated Jan 8, 2021, 12:20 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు. అంతేకాకుండా  బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా సొమ్మసిల్లి పడిపోగా ఆయనను విశాఖపట్నంలోని కేజీహెచ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.