Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధాని అమరావతే... బిజెపి విధానమిదే..: కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతే రాజధానిగా వుంటుందని...

First Published Sep 27, 2022, 4:18 PM IST | Last Updated Sep 27, 2022, 4:18 PM IST

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతే రాజధానిగా వుంటుందని... ఇదే బిజెపి విధానమని మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. అయితే హైకోర్టును కర్నూల్ కు తరలించాలన్న వైసిపి నిర్ణయాన్ని మాత్రం స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.  అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది... అలాంటిది వారిని అడుగడుగునా అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. బిజెపి కూడా అమరావతి పాదయాత్రకు పూర్తి మద్దత్తు ఇస్తోందని వెల్లడించారు. అమరావతి యాత్రలో పాల్గొన్న రైతులకు ఏం జరిగినా దానికి సిఎం బాధ్యత వహించాల్సి వుంటుందని కన్నా హెచ్చరించారు. ఇక పోలవరం నిర్మాణంపైనా కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించడం సాధ్యం కాకపోతే తప్పుకోవాలని... తాము దీన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటూ వైసిపి ప్రభుత్వానికి కన్నా సవాల్ చేసారు.