Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏడాది ఆ పెద్ద నాయకుడికి ఇబ్బందులు తప్పవు..: స్వరూపానందేంద్ర సరస్వతి

విశాఖపట్నం: శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 

విశాఖపట్నం: శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ప్లవ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడమని... ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఏడాది వెలుగులు నిండాలని స్వరూపానందేంద్ర కోరుకున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో జరిగిన ఉగాది వేడుకలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీఠం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు పీఠాధిపతులు.  ఈ సందర్భంగా -స్వరూపానందేంద్ర మాట్లాడుతూ... ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయన్నారు. గ్రహాల అనుకూలత లేకున్నా తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నాని అన్నారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.