Asianet News TeluguAsianet News Telugu
breaking news image

వైసీపీ నాయకులు భీమ్లా నాయక్ సినిమా పైరసీ లింకులను ఆన్ లైన్ లో పెడుతున్నారు... అభిమానుల ఫిర్యాదు

శుక్రవారం విడుదలైన బీమ్లా నాయక్ సినిమా ఫైరసీ వీడియోలను వైసిపికి చెందిన కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా సినిమా విజయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో సామాజిక మాధ్యమాల్లో పైరసీ వీడియో లింకులు పెట్టినట్లు నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకటేష్ కు చిరంజీవి యువత ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు సత్రపు సుధీర్, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు . 

శుక్రవారం విడుదలైన బీమ్లా నాయక్ సినిమా ఫైరసీ వీడియోలను వైసిపికి చెందిన కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా సినిమా విజయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో సామాజిక మాధ్యమాల్లో పైరసీ వీడియో లింకులు పెట్టినట్లు నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకటేష్ కు చిరంజీవి యువత ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు సత్రపు సుధీర్, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు . సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ చిత్రాన్ని పైరసీ లింకులు షేర్ చేసి, పవన్ కళ్యాణ్ చిత్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు ఎన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ చిత్రాలను దెబ్బతీయాలని చూసిన ప్రజాభిమానం ముందు వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాన సంఘం, జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండలం చిరంజీవి యువత సభ్యులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు