Asianet News TeluguAsianet News Telugu

Bheemla Nayak:మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికి తాకిన భీమ్లా నాయక్ సెగ...

విజయవాడ: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పాటు మరోమంత్రి కొడాలి నానికి భీమ్లా నాయక్ సెగ తగిలింది. 

విజయవాడ: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పాటు మరోమంత్రి కొడాలి నానికి భీమ్లా నాయక్ సెగ తగిలింది. పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. దీంతో థియేటర్ వద్ద గుమిగూడిన పవన్ అభిమానులు మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నసించాలంటూ నినదిస్తూ జనసేన జెండాలు, ఎర్ర కండువాలు చేతబట్టి అభిమానులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.