మహిళల ఆందోళన... సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత
తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భీమా మిత్ర మహిళలు ఆందోళనకు దిగారు.
తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భీమా మిత్ర మహిళలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భీమా మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు నిరసనకు దిగారు. ఇలా ఆందోళన చేపట్టిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పోలీసులకు మహిళలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.