దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ షురూ... కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ : భవాని దీక్షాధారులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. ఇవాళ్టి(గురువారం) నుండి ఐదురోజుల పాటు విజయవాడ ఆలయ ప్రాంగణంలో భవాని దీక్షల విరమణ చేపట్టనున్నారు.
విజయవాడ : భవాని దీక్షాధారులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. ఇవాళ్టి(గురువారం) నుండి ఐదురోజుల పాటు విజయవాడ ఆలయ ప్రాంగణంలో భవాని దీక్షల విరమణ చేపట్టనున్నారు. ఇందుకోసం విజయవాడ కనదుర్గమ్మ ఆలయ ఈఓ భమ్రరాంబ, అర్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు తెల్లవారుజామున 3 హోమగుండాల్లో ఆజ్యం సమర్పించి దీక్షా విరమణను ప్రారంభించారు. కరోనా తర్వాత భవాని దీక్షల విరమణకు అనుమతివ్వడంతో భారీగా భవానీలు (7 లక్షలకు పైగా) అమ్మవారి దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భవాని దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేసారు. భవానిల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండన శాలలు ఎర్పాటు చేసారు. సీతమ్మ పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేసారు. 0లక్షల లడ్డూలు సిద్దం చేసి 10 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు.