Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కేసీఆర్ పాలిటిక్స్ ... అమలాపురం సెంటర్లో బీఆర్ఎస్ ప్లెక్సీలు

అమలాపురం : కేసీఆర్ జాతీయపార్టీ బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

అమలాపురం : కేసీఆర్ జాతీయపార్టీ బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి తెలుగు రాష్ట్రాన్ని విడదీసిన కేసీఆర్ కు ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టనివ్వబోమని కొందరు నాయకులు హెచ్చరిస్తుంటే... మరికొందరు బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇలా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బిఆర్ఎస్ కు మద్దతుగా ప్లెక్సీలు వెలిసాయి.  దసరా రోజున కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రకటించగా రెండు రోజుల్లోనే అమలాపురం పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిని తానేనంటూ రేవు అమ్మాజీరావు పేరిట ప్లెక్సీలు వెలిసారు. అమలాపురం సెంటర్లో గులాబీ రంగులో జై కేసీఆర్... జై బోలో బిఆర్ఎస్ నినాదాలతో వెలిసిన ప్లెక్సీలు కోనసీమ జిల్లాలోనే కాదు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.