Asianet News TeluguAsianet News Telugu

పరీక్షలకు అనుమతివ్వని కాలేజీ సిబ్బంది... రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల ధర్నా

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డుపై బైఠాయించి బిఈడి విద్యార్థులు ఆందోళనకు దిగారు.

First Published Dec 19, 2022, 2:17 PM IST | Last Updated Dec 19, 2022, 2:17 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డుపై బైఠాయించి బిఈడి విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్జిఎస్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు కొందరిని సిబ్బంది అనుమతించలేదంటూ బయటకు పంపించారు. తమకు హాల్ టికెట్లు ఇచ్చి ఇలా పరీక్షకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన బాధిత విద్యార్థులు కాలేజి ఎదుట ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.