దేవాదాయ మంత్రికి చేదు అనుభవం... కారు ముందు పడుకుని నాయిబ్రాహ్మణుల ఆందోళన
విజయవాడ : దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం పే స్కేల్ ఇస్తూ సిద్దం చేసిన జీఓ ను అమలు చేయాలని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు.
విజయవాడ : దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం పే స్కేల్ ఇస్తూ సిద్దం చేసిన జీఓ ను అమలు చేయాలని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన జీఓను వెంటనే అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను ఘెరావ్ చేసారు. ఇప్పుడు అమలుచేస్తున్న రూ.10,000 ఫిక్సుడ్ సాలరీ తమకు వద్దంటూ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నాయి బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి.