Asianet News TeluguAsianet News Telugu

పక్కన కూర్చోబెట్టుకుని వెకిలి చేష్టలు... బాపట్ల కలెక్టరేట్ ఉద్యోగిని వేధింపు ఆరోపణలు

అమరావతి : బాపట్ల కలెక్టర్ కార్యాలయం డిపిఆర్సి (జిల్లా పంచాయితీ వనరుల కేంద్రం) లో నోడల్ ఆఫీసర్ గా పనిచేసే తనను ఓ ఉన్నతాధికారి సహాయక సిబ్బంది వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగింది. 

First Published Nov 23, 2022, 4:44 PM IST | Last Updated Nov 23, 2022, 4:44 PM IST

అమరావతి : బాపట్ల కలెక్టర్ కార్యాలయం డిపిఆర్సి (జిల్లా పంచాయితీ వనరుల కేంద్రం) లో నోడల్ ఆఫీసర్ గా పనిచేసే తనను ఓ ఉన్నతాధికారి సహాయక సిబ్బంది వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగింది. డిజిపివో వద్ద అటెండర్ గా పనిచేసే రాయుడు తిరుపతి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. అలాగే డిపిఆర్సిలో కంప్యూటర్ ఆపరేటర్ కూడా తనను వేధిస్తున్నాడని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా తనపైనే ఆగ్రహం వ్యక్తంచేసాడని... వినోద్ ని సరిగ్గా చూసుకోవాలని చెప్పాడన్నారు. ఇలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న తనకు రక్షణ కరువైందని మహిళా ఉద్యోగిని వాపోయారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ అధికారిని తెలిపారు.