వైసీపీ నేతలు బ్రాందీ సీసాలు గ్రామాల్లో దాచుకున్నారు.. అయ్యన్నపాత్రుడు

ఏపీలో కరోనా రోజు రోజుకి ఉధృతమవుతోంది. రాష్ట్ర పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

First Published Apr 23, 2020, 6:06 PM IST | Last Updated Apr 23, 2020, 6:06 PM IST

ఏపీలో కరోనా రోజు రోజుకి ఉధృతమవుతోంది. రాష్ట్ర పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానికి అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విలేకర్ల సమావేశంలో విరుచుకుపడ్డారు.  ఇటువంటి సమయంలో ప్రస్టేజ్ కి పోకుండా అన్ని పార్టీల నేతలు, అనుభవం ఉన్న వ్యక్తులు, డాక్టర్లు, సైంటిస్టులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అలా కాకుండా నేను ఎవరి మాట వినను, నా ఇష్టానుసారం చేస్తానని ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తే ప్రజలు నష్టపోతారు.  స్థానిక ఎన్నికలు వస్తాయని వైసీపీ నేతలు మందు బాటిళ్లను గ్రామాల్లో దాచుకున్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బందికి మాస్కుల కోసం కూడా చందాలు వసూలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.