విజయవాడ టిడిపిలో జోష్... బోండా ఉమ సమక్షంలో భారీగా చేరికలు
విజయవాడ: తెలుగుదేశం కార్మిక విభాగం TNTUC నాయకులు గరిమెళ్ల చిన్న, కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విజయవాడ కు చెందిన ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
విజయవాడ: తెలుగుదేశం కార్మిక విభాగం TNTUC నాయకులు గరిమెళ్ల చిన్న, కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విజయవాడ కు చెందిన ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దాదాపు 50మంది ఆటో కార్మికులకు టిడిపి కడువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ 3సంవత్సరాలలో రవాణా కార్మికులను నట్టేట ముంచారన్నారు. మూడేళ్ళలో 5సార్లకు పైగా పెట్రోల్, డీజిల్, ధరలు పెరిగాయని.... టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు 60, 70 రూపాయలుంటే నానా మాటలు అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. ఇక రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఇంకో చాన్సు ఇచ్చేనందుకు సిద్ధంగా లేరని... ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్మికులంతా టిడిపికి పట్టం కట్టి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని బోండా ఉమ పేర్కొన్నారు.