Asianet News TeluguAsianet News Telugu

అక్రమార్కుని అరెస్ట్ చేసినందుకు... ఏపీలో తెలంగాణ పోలీసులపై దాడి

గుంటూరు: ఓ అక్రమార్కున్ని పట్టుకోడానికి ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు.

గుంటూరు: ఓ అక్రమార్కున్ని పట్టుకోడానికి ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బొమ్మిరెడ్డి శ్రీనివాసరావు తెలంగాణలో రేషన్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడు. దీంతో అతడిపై నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ స్టేషన్ కేసు నమోదయ్యింది. అయితే అతడిని అరెస్ట్ చేయడానికి దాచేపల్లి వెళ్లిన పోలీసులను అడ్డుకున్న స్థానికులు కొందరు దాడికి తెగబడ్డారు. 

 బుధవారం అర్ధరాత్రి శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కొందరు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడమే కాదు కానిస్టేబుల్ నాగేశ్వరావుపై దాడికి దిగారు. 

Video Top Stories