ఏలూరులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి..
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్‍ను దుండగులు కత్తితో నరికిచంపారు.
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్‍ను దుండగులు కత్తితో నరికిచంపారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్య అనుచరుడు స్థానిక ఎంపీటీసీ బజార్‍పై హత్యారోపణలు చేశారు. కాగా, ఎమ్మెల్యే బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. హత్యకు ఎమ్మెల్యే అనుచరుడే కారణమని ఆగ్రహించిన స్థానికులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసుల మోహరించారు. పోలీసుల రక్షణతో గ్రామం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.