Video : పార్టీలో చేరే ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత...
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి.
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. చేజర్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, చేజర్ల మండల కన్వీనర్ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ బి.సి. కన్వీనర్ గోతం వెంకటసుబ్బయ్య మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని మేకపాటి అన్నారు.