మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కాంగ్రెస్ అసంతృప్తి... కారణమిదే...
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్. శైలజానాధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్. శైలజానాధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నోటిఫికేషన్ ను కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్ ఎస్ఈసి విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో జరిగిన ఏకగ్రీవాలను కొనసాగిస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని శైలజానాథ్ అన్నారు.