సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కృష్ణ సూపర్ స్టారే..: ఏపిసిసి చీఫ్ శైలజానాథ్

విజయవాడ  : అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

First Published Nov 15, 2022, 9:42 AM IST | Last Updated Nov 15, 2022, 9:42 AM IST

విజయవాడ  : అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తెలుగు సినీ పరిశ్రమకు హీరోగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా దాదాపు ఐదు దశాబ్దాలు ఆయన చేసిన సేవలు మరువరానివని అన్నారు. సినీ జీవితంలో అద్భుతమైన పాత్రలు పోషించి చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి టాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. 

సినీరంగానికే కాదు కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన కృష్ణ ప్రజాసేవ కూడా చేసారని శైలజానాథ్ గుర్తుచేసారు. ఇందిరా, రాజీవ్ గాంధీ స్పూర్తితో 1989లో ఏలూరు ఎంపీగా పోటీచేసి గెలిచిన కృష్ణ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసారన్నారు. కృష్ణ మరణం పట్ల సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు శైలజానాథ్ పేర్కొన్నారు.