పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు... ఏపిసిసి చీఫ్ శైలజానాథ్ సీరియస్
విజయవాడ : పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతా రహితమైన మాటలు తగవని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు.
విజయవాడ : పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతా రహితమైన మాటలు తగవని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. అసలు మీ పాలన ప్రజల కోసమా.. వ్యాపారుల కోసమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి పన్నులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే డీజిల్, పెట్రోల్ పన్నుల పేరుతో సుమారు రూ.30 లక్షల కోట్లు కేంద్రం తీసుకుందని... ఇప్పుడు రాష్ట్రాలపై పన్నుల భారం మోపడం సరి కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని పన్నులు తగ్గించే ఆలోచన చేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వం వ్యాపారస్తుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని శైలజనాథ్ హితవు పలికారు.