Asianet News TeluguAsianet News Telugu
breaking news image

పాయకరావుపేట పాస్టర్ కీచకపర్వం... మహిళా కమీషన్ చైర్ పర్సన్ సీరియస్

దొంగ మతబోధకుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

దొంగ మతబోధకుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. పాయకరావుపేటలో ఇటీవల వెలుగుచూసిపన కీచక పాస్టర్ అరాచకాలపై విచారణకు సంబంధించిన నివేదిక మహిళా కమిషన్ కోరింది. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కఠిన శిక్షలతో దొంగ మత గురువులకు బుద్ధిచెప్పాలని ఆదేశించారు. ప్రేమస్వరూపి మందిరంలో బందీలుగా వుండి తాజాగా విముక్తి పొందిన బాధితుల కౌన్సిలింగ్ ఇవ్వాలని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పద్మ ఆదేశించారు.