ఏపీలో భారీ వర్షాలు, వరదలు... ఆ పరీక్షలు వాయిదా వేయండి : వీఆర్వోల సంఘం డిమాండ్
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జూలై 24, 31వ తేదీల్లో వీఆర్వోలకు నిర్వహిస్తున్న సర్వే ట్రైనింగ్ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు డిమాండ్ చేసారు.
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జూలై 24, 31వ తేదీల్లో వీఆర్వోలకు నిర్వహిస్తున్న సర్వే ట్రైనింగ్ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు డిమాండ్ చేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి భారీగా వరద వచ్చాయని... దీంతో ముంపు ప్రాంతాల్లో వీఆర్వోలు రాత్రి, పగలు తేడాలేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో వరద పరిస్థితులే వున్నాయని... ఇలాంటి స్థితిలో వీఆర్వోలు పరీక్షలకు హాజరవడం చాలా కష్టతరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలను వాయిదా వేయాలని... దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామని రవీంద్రరాజు పేర్కొన్నారు. మానవతా ధృక్పధంతో ప్రభుత్వం పరీక్షల తేదీలను మార్పు చేయాలని కోరారు.