మంత్రి పేర్ని నానితో ఆర్. నారాయణమూర్తి భేటీ... థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలతో బెంబేలెత్తిపోతున్న సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కాస్త ఊరట లభించింది. ఇప్పటికే సీజ్ చేసిన థియేటర్లతో పాటు మూతపడ్డివాటిని తిరిగి ఓపెన్ చేసేందుకు జగన్ సర్కార్ అవకాశం కల్పించింది. అన్ని థియేటర్ల యాజమాన్యాలకు మరో నెలరోజులు గడువు ఇస్తున్నామని... అప్పటివరకు ప్రభుత్వ నిబంధనలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ల కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు.గురువారం మచిలీపట్నంలో మంత్రి నానిని సినీ నిర్మాత, నటులు ఆర్. నారాయణమూర్తితో పాటు మూతపడిన థియేటర్ల యజమాన్యాలు కలిసాయి. తాజా నిర్ణయంతో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లతో పాటు తనిఖీలకు భయపడి మూతపడ్డ 22 థియేటర్లకు కాస్త ఊరట లభించింది.