బదిరుల ఒలింపిక్స్‌ కాంస్య విజేత జాఫ్రిన్ కు ప్రభుత్వ ఉద్యోగం... సీఎం జగన్ ఆదేశాలు

అమరావతి: ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను, బదిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022) సత్తాచాటి కాంస్యం సాధించిన కర్నూల్ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు.

First Published Jun 25, 2022, 9:59 AM IST | Last Updated Jun 25, 2022, 9:59 AM IST

అమరావతి: ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను, బదిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022) సత్తాచాటి కాంస్యం సాధించిన కర్నూల్ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇవాళ (గురువారం) క్రీడల మంత్రి  ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డిలు శ్రీకాంత్, జాఫ్రిన్ ను  సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిపించారు. ఈ సందర్భంగా ఇద్దరు క్రీడాకారులను శాలువా కప్పి సీఎం సన్మానించారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని... ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు జగన్ సూచించారు.