ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగసంఘం ఎన్నికలు... వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఘనవిజయం
అమరావతి : ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులసంఘం ఎన్నికల్లో మరోసారి వెంకట్రామిరెడ్డి ప్యానల్ అద్భుత విజయాన్ని అందుకుంది.
అమరావతి : ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులసంఘం ఎన్నికల్లో మరోసారి వెంకట్రామిరెడ్డి ప్యానల్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన ప్రత్యర్థి రామకృష్ణ ప్యానల్ చిత్తుగా ఓడిపోయింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో పోలయిన ఓట్లలో రెండోసారి అధ్యక్షుడిగా పోటీచేసిన వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా ప్రత్యర్థి రామకృష్ణకు 432 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 280 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. ఇక వైస్ ప్రెసిడెంట్ గా ఎర్రన్న యాదవ్ 478, మహిళ వైస్ ప్రెసిడెంట్ గా సత్య సులోచన 351, ప్రధాన కార్యదర్శి గా 339 ఓట్లతో శ్రీ కృష్ణ విజయం సాధించారు.