కృష్ణా జిల్లాలో లక్షల విలువైన గంజాయి అగ్గికి ఆహుతి...
గన్నవరం : గత మూడు నెలలుగా ఏపీ ఎస్.ఈ.బి (స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో) అధికారుల దాడుల్లో పట్టుబడిన గంజాయి అగ్గికి ఆహుతయ్యింది.
గన్నవరం : గత మూడు నెలలుగా ఏపీ ఎస్.ఈ.బి (స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో) అధికారుల దాడుల్లో పట్టుబడిన గంజాయి అగ్గికి ఆహుతయ్యింది. దాదాపు 20 లక్షల విలువచేసే 770 కిలోల గంజాయిని ఎస్.ఈ.బి అధికారులే దహనం చేసారు. గన్నవరం మండలం గొలనపల్లి గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఈ గంజాయిని దహనం జరిగింది. గంజాయి పూర్తిగా కాలి బూడిదయ్యేవరకు పోలీసులు అక్కడే వున్నారు.