Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీ చిచ్చు... ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ళ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు, తీవ్ర ఉద్రిక్తత

తాడేపల్లి: పిఆర్సీ నేతల ఇళ్ళ ముట్టడికి ఉపాద్యాయ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే 
ప్రైమ్ గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. పిఆర్సీ నేతలు వెంకట రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇళ్ళ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఏపీఎన్జీవో కార్యాలయాలన్ని కూడా ఉద్యోగసంఘాలు ముట్టడించే అవకాశం వుండటంతో అక్కడకూడా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు, శివారెడ్డిల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేసారు.  దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎన్జీవో భవనం ఉన్న రహదారిని బారికేడ్లతో మూసివేసారు. ఆందోళన చేసేందుకు ఉపాధ్యాయులు వస్తే అరెస్టు చేసేందుకు పోలీస్ వాహనాలను సిద్దంగా వుంచారు.