ఏపీలో తారాస్థాయిలో కరెంటు కోతలు... మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో డెలివరీ
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణీకి డాకర్లు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారు.
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణీకి డాకర్లు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారు. హృదయాన్ని ద్రవింపచేసే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటుచేసుకుంది. కరెంట్ కోతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఏపీలో కొద్ది రోజులుగా భారీగా విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా విద్యుత్ కోతలతో పెషేంట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలింతలు, పసిపాపల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కేడి పేటకు చెందిన గర్భిణి అనకాపపల్లిలోని నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో చేరింది.