ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్... నడిరోడ్డుపై వృద్దులు, చిన్నారిని ఆటోలోంచి దింపేసి

గన్నవరం : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.

First Published Jul 4, 2022, 3:13 PM IST | Last Updated Jul 4, 2022, 3:13 PM IST

గన్నవరం : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఏపీ పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించారు. ప్రధానిని అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో నందివాడ నుండి నందిగామ వెళుతున్న ఓ ఆటోను పోలీసులు ఆపి... అందులో ప్రయాణిస్తున్న వృద్దులు, ఓ చిన్నారిని దింపేసి పద్మశ్రీని అందులో తరలించారు. దీంతో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో వృద్దులు జాతీయ రహదారిపై వుండిపోయారు. ఇలా నడిరోడ్డుపై దించేయడంతో నందిగామ వెళ్ళడానికి వారు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వచ్చింది.