Asianet News TeluguAsianet News Telugu

జవాబుదారితనం కోసం... పంచాయితీ ఎన్నికల్లో ఓటేయండి: ఎస్ఈసీ నిమ్మగడ్డ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు విడతల్లో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలను కోరారు. 

First Published Feb 7, 2021, 12:29 PM IST | Last Updated Feb 7, 2021, 12:29 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు విడతల్లో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలను కోరారు. ప్రశాంత వాతావరణంలో, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.  ఓటు హక్కుతో పంచాయితీలకు జవసత్వం నింపాలని...దీంతో వ్యవస్థలు మెరుగైన పనితీరు, జవాబుదారితనం   కనబరుస్తాయన్నారు. అందరూ ఓటుహక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని నిమ్మగడ్డ సూచించారు.