వైన్ షాప్ ముందు టిడిపి శ్రేణుల ధర్నా... పోలీసుల లాఠీ చార్జ్
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఇలా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ఉల్లిపాలెం రోడ్ లో వైన్ షాప్ నుంచి వైసిపి శ్రేణులు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని తెలుసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రి 10 గంటలు దాటినా కూడా అధికార పార్టి వాళ్ళకి మద్యం కేసులు మీద కేసులు వెనుకదారి నుండి సరఫరా చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించారు.వైన్ షాప్ వద్ద టిడిపి నాయకులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రతిపక్ష నేతలపై లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికి మద్యం అడ్డదారిలో తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని టిడిపి నేతలు తెలిపారు.