ఏపీలో ఉపాధ్యాయుల ఆందోళన... గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. 

First Published Mar 4, 2022, 5:53 PM IST | Last Updated Mar 4, 2022, 5:53 PM IST

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 196 గిరిజన గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 1750 మంది ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అద్యాపకులను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. వందలసంఖ్యలో అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు కార్యాలయంవద్దకు చేరుకుని న్యాయపరమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.