పిఆర్సిపై ఉద్యోగ సంఘాల ఉమ్మడి ఐక్య కార్యాచరణ...
విజయవాడ : ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందించడం కోసం విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో 4 సంఘాల నేతలు సమావేశమయ్యారు.
విజయవాడ : ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందించడం కోసం విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో 4 సంఘాల నేతలు సమావేశమయ్యారు. వచ్చే నెల 7 లేదా 8 నుంచి ఉద్యోగుల సమ్మెబాట పట్గిలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వచ్చే నెల 3 న చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25 న కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉద్యమ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈసమావేశం ముందుగా సచివాలయంలో జరగాల్సి ఉంది. భద్రత కారణాలు దృష్టా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వేదిక విజయవాలోని ఏపీ ఎన్జీవో భవన్ కి మారింది.