Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లి సచివాలయాల్లో మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ ఆకస్మిక తనిఖీలు...

గుంటూరు:  ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ తాడేపల్లి సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 

First Published Dec 15, 2022, 3:47 PM IST | Last Updated Dec 15, 2022, 3:47 PM IST

గుంటూరు:  ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ తాడేపల్లి సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే  పట్టణం 13,14 వార్డు సచివాలయాలకు వెళ్ళిన శ్రీలక్ష్మి రికార్డులు, ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే ఈ సచివాలయాల ఉద్యోగుల పనితీరు గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకే సచివాలయాల ఏర్పాటు జరిగిందని అన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని శ్రీలక్ష్మి ఆదేశించారు.