గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత... పోలింగ్ బూత్ వద్దే వైసిపి-టిడిపి వర్గాల ఘర్షణ
Apr 8, 2021, 1:49 PM IST
పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటుచేసిప పోలింగు బూత్ వద్దే వైసిపి-టిడిపి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. అధికారులు, పోలీసులు అధికార పక్షానికి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపించారు.