సవరించిన అంచనాలపై కేంద్ర మంత్రి హామీ: అనిల్

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదించడానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ తోమర్ అంగీకరించినట్లు ఆంద్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనికల్ కుమార్ యాదవ్ చెప్పారు. 

First Published Dec 11, 2020, 2:05 PM IST | Last Updated Dec 11, 2020, 2:05 PM IST

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదించడానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ తోమర్ అంగీకరించినట్లు ఆంద్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనికల్ కుమార్ యాదవ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి తోమర్ 15 రోజుల్లో వస్తానని చెప్పినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందన్రాథ్ రెడ్డి శుక్రవారం తోమర్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు గురించి వారు ఆయనకు వివరించారు.  పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు అనిల్ చెప్పారు.