Asianet News TeluguAsianet News Telugu

ఆటలు, పాటలు... మొదలైన సంక్రాంతి సంబరాలు

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి మంత్రి జయరామ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎస్పీ ఫకీరప్పలు కబడ్డీ ఆడి అలరించారు. మహిళలకు ముగ్గుల పోటీ, తాడు లాగుట, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, మరియు పురుషులకు కబడి, టెంకాయ విసురుట, ఎద్దులబండిలాగుట పోటీలను నిర్వహించారు.కర్నూలు జిల్లా లోని కప్పట్రాళ్ల గ్రామం పేరు చెప్తే రాయలసీమలో తెలియని వారంటూ ఉండరు. దానికి కారణం ఫ్యాక్షన్ హత్యలు కారణం. కాని అలాంటి ఫ్యాక్షన్ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి సంక్రాంతి సంబరాలు ముందుగా జరుపుకోవడం గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం ఈ కప్పట్రాళ్ల గ్రామని దత్తతకు  తీసుకున్న ఐపిస్ అధికారి ఆర్ కె రవి కృష్ణ. గ్రామంలో యువత ను ఫ్యాక్షన్ వైపు కాకుండా ఉద్యోగ, ఉపాధి వైపుకు అడుగులు వేసే విధంగా తీర్చిదిద్దారు.కప్పట్రాళ్ల గ్రామం ప్రజలకు ఇంటర్నేషనల్ కోరమండల్ వారితో వీడదీయలేని బంధం ఏర్పడింది. కోరమండల్ వారు గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించారు. గ్రామంలోని రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులను రైతులకు తెలియజేయడానికి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి వ్యవసాయ సాగు నూతన విధానాలను రైతులకు అవగాహన కల్పించారు.