Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఏపీ ఆర్ధిక ఎమెర్జెన్సీలోకి వెళుతుంది : దగ్గుబాటి పురంధేశ్వరి

సింహాచలంలో నేడు మన్ కి బాత్ పై తెలుగు చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సింహాచలంలో నేడు మన్ కి బాత్ పై తెలుగు చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక ఎమర్జెన్సీలోకి వెళ్తుందని, రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తుందని ఈ సందర్భంగా పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. కార్పోరేషన్లు ఉత్పాదకతను మెరుగుపరచడానికి కాకుండా, కేవలం రుణాలు పొందేందుకే ప్రభుత్వ భూములు, భవనాలు వంటి ఆస్తులు అమ్మడం లేదా తనఖా పెట్టడం జరుగుతోందని, నేడు ఏపీ రుణాలు ఆరు లక్షల కోట్లకు పైగా ఉన్నాయని, రెవెన్యూ లోటు అనుమతించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని కాగ్ స్పష్టంగా చెబుతోందని ఈ సందర్భంగా ఆమె తెలియపరిచారు.